ధర్మయాత్రలో భాగంగా రామతీర్థం వెళ్లిన భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామతీర్థం యాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. హిందూ ఆలయాలపై దాడులను నియంత్రించాలని కోరారు.
రామతీర్థానికి నేను వెళ్తే తప్పేంటి : సోము వీర్రాజు - bjp andhra pradesh state president
ఏపీలో కోదండ రాముని విగ్రహం ధ్వంసం ఘటనపై 'భాజపా- జనసేన' తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ వెల్లంపల్లి రాజీనామా చేయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు.
- ఇదీ చదవండి : ఏపీలో పొలిటికల్ హీట్.. సోము వీర్రాజును అడ్డుకున్న పోలీసులు, తోపులాట