తెలంగాణ

telangana

ETV Bharat / city

యువతిని వివస్త్రను చేసి.. వికృత చేష్టలు - నెల్లూరులో వివస్త్ర యువతి

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు నగరంలో ఓ యువతి పట్ల కీచకుల్లా ప్రవర్తించారు కొంతమంది యువకులు. ఆమెను వివస్త్రను చేసి అమానుషంగా ప్రవర్తించారు. ఓ గొర్రెల కాపరి బాధితురాలని కాపాడాడు.

ఏపీ: యువతిని వివస్త్రను చేసి వికృత చేష్టలు
ఏపీ: యువతిని వివస్త్రను చేసి వికృత చేష్టలు

By

Published : Aug 14, 2020, 11:47 AM IST

కొందరు యువకులు మృగాలుగా మారి ఓ యువతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. వివిస్త్రను చేసి.. దుస్తులు ఇవ్వకుండా వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం జనార్ధనరెడ్డి కాలనీలో బుధవారం రాత్రి జరిగింది.

మహమూరు మసీదు వెనక గొర్రెలమండీ ఉంది. దీని పక్కన నిర్మానుష్యంగా ఉండటంతో చీకటి కార్యకలాపాలకు వేదికగా మారింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఓ గొర్రెలకాపరి అటువైపు వెళుతుండగా ఓ ఆటో నిలిపి ఉంది. ఆ ప్రాంతంలో ఎందుకుందో అనుకుంటూ .. అనుమానం వచ్చి చూడగా ఆరుగురు యువకులు కలిసి ఒక యువతిని వివస్త్రను చేసి దుస్తులు ఇవ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆయన తన దగ్గర ఉన్న టార్చి లైటు వేయడంతో వారు అక్కడి నుంచి ఆటోలో పరారయ్యారు. ఆటో వెనుక భాగంలో ఓ సినిమా నటుడి స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. గొర్రెల కాపరి ఆమెకి దుస్తులు ఇవ్వటంతో...యువతి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై నవాబుపేట సీఐ వేమారెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి.శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details