వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తో అయన నివాసంలో భేటీ అయ్యారు. అందులో మహబూబ్‌నగర్ జిల్లా భాజపా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, భూపాల్‌పల్లి నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు, నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ తదితర నేతలు ఉన్నారు. వారంతా.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
Revanth Reddy : నయా జోష్.. రేవంత్‌తో వివిధ పార్టీల నేతల భేటీ - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూస్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని.. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కలిశారు. తన నివాసంలో వారితో రేవంత్ భేటీ అయ్యారు.
రేవంత్‌రెడ్డిని కలిసిన పలు పార్టీల నేతలు
భాజపాకు రాజీనామా చేస్తున్నట్టు ఎర్ర శేఖర్ ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానని పేర్కొన్నారు.