తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో వెలుగుల జిలుగుల 'సౌర'భం - Solar power on subsidy in Telangana

తెలంగాణలో సౌర వెలుగులు విరజిమ్ముతున్నాయి. పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ.. ఒక పక్క ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర ఫలకాల ఏర్పాటుపై దృష్టి సారిస్తూనే.. మరోపక్క గృహ వినియోగదారులకు ప్రత్యేక సబ్సిడీని అందజేస్తోంది. దీంతో వినియోగదారులు తమ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో ఇంటి పైకప్పుపై 148.63 మెగావాట్ల సౌర ఫలకలను ఏర్పాటు చేసుకున్నారు.

solar power usage in telangana is gradually increasing
తెలంగాణలో సౌర వెలుగుల జిలుగులు

By

Published : Jan 27, 2021, 8:58 AM IST

సౌర విద్యుత్ వినియోగంపై పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ దృష్టి సారించింది. గృహ వినియోగదారులకు సోలార్ విద్యుత్​పై అవగాహన కల్పిస్తోంది. ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ.. వారిని ప్రోత్సహిస్తోంది. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారులకు 3 కిలోవాట్ల వరకు 40 శాతం సబ్సిడీ అందజేస్తోంది. 3 నుంచి 10 కిలోవాట్ల వరకు వినియోగించే వారికి ఇంధన అభివృద్ధి సంస్థ అధికారులు 20 శాతం సబ్సిడీ అందజేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో లిఫ్ట్​లు, వీధి దీపాలు, మంచినీటి వినియోగం కోసం 20 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.

గృహ వినియోగదారులు, గేటెడ్ కమ్యూనిటీలో సౌర విద్యుత్​ను వినియోగించుకున్న తర్వాత ఇంకా మిగులు విద్యుత్ ఉంటే.. దాన్ని తిరిగి విద్యుత్ శాఖ వారికి అమ్ముకోవచ్చు. ఇందుకోసం నెట్ మీటరింగ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. యూనిట్​కు రూ.4.18 పైసలు విద్యుత్ శాఖ చెల్లించే విధంగా అంగీకారం కూడా కుదుర్చుకున్నట్లు రెడ్కో వివరించింది. బహిరంగ మార్కెట్​లో సోలార్ ప్యానెళ్లు తక్కువ ధరకే దొరుకుతుండటం వల్ల పరిశ్రమలకు రాయితీ ఇవ్వడం లేదని రెడ్కో వర్గాలు వెల్లడించాయి. పరిశ్రమలకు ఒక మెగావాట్ వరకు సోలార్ పవర్ విద్యుత్​ను వినియోగించుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

ప్రభుత్వ సంస్థల్లో సౌర విద్యుత్​ను ఎక్కువగా వినియోగిస్తున్నారని రెడ్కో వెల్లడించింది.

సంస్థలు సౌర విద్యుత్ వినియోగం
టీఎస్.ఆర్టీసీ బస్ డిపో 4,200కిలోవాట్స్
నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ 250 కిలోవాట్స్
నల్సార్ లా యూనివర్సిటీ 200 కిలోవాట్స్
ఎం.సీఆర్-హెచ్.ఆర్.డీ 850 కిలోవాట్స్
డాక్టర్.బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 300 కిలోవాట్స్
టీఎస్ పోలీస్ అకాడమీ 320 కిలోవాట్స్
ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్జ్ ఇన్స్​స్టిట్యూషన్ 200 కిలోవాట్స్
మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్ట్ కాంప్లెక్స్ 200 కిలోవాట్స్
జీహెచ్.ఎంసీ 941 కిలోవాట్స్
వెల్పేర్ అసోసియేషన్ ఆఫ్ రెయిన్ పార్క్ 400 కిలోవాట్స్
రాజ్ భవన్ ఏ టైప్ క్వార్టర్స్ 243 కిలోవాట్స్
సంవత్సరం సౌర విద్యుత్ ఉత్పత్తి
2014-15లో 4.1435 మెగావాట్లు
2015-16లో 5.7749మెగావాట్లు
2016-17లో 7.901 మెగావాట్లు
2017-18లో 13.1145 మెగావాట్లు
2018-19లో 41.8861మెగావాట్లు
2019-20లో 45.4004మెగావాట్లు
2020-21లో 30.4096మెగావాట్లు
మొత్తం 148.63 మెగావాట్లు

రాష్ట్ర ఆవిర్భానికి ముందు ఇంటి పైకప్పు లో సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టిసారించలేదు. రాష్ట్ర ఆవిర్బావం తర్వాత పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ దీనిపై ప్రత్యేక దృష్టిసారించింది.

ABOUT THE AUTHOR

...view details