కరోనా సోకిందని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..! - కరోనా సోకిందని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..!
14:10 January 27
కరోనా సోకిందని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..!
కరోనా సోకిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ యువతి(28) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పని చేస్తోంది. అల్వాల్ కానాజీగూడలో నివాసం ఉంటోంది. ఈ నెల 21న అస్వస్థతకు గురికావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది.
అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటూ.. చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 23న సాయంత్రం తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. అనుమానంతో కుటుంబసభ్యులు ఆమె నివాసానికి వచ్చి పరిశీలించగా.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.