తెలంగాణ

telangana

ETV Bharat / city

కంప్యూటర్​ సీపీయూలోకి దూరిన సర్పం - కంప్యూటర్​లో పాము

సీపీయూను రిపేర్ కోసం ఇచ్చారు. బాగు చేద్దామని పని మొదలుపెట్టిన మెకానిక్​కు.. బుసలు కొడుతున్న శబ్ధం వినిపించింది. తీరా చూస్తే... తెలుపు, నలుపు మచ్చలు కలిగిన సర్పం మెలికలు తిరుగుతూ దర్శనమిచ్చింది.

snake in cpu
కంప్యూటర్​ సీపీయూలోకి దూరిన సర్పం

By

Published : Jun 14, 2020, 5:22 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా సున్నిపెంటలో కంప్యూటర్ రిపేర్‌ దుకాణంలో ఓ పాము కలకలం సృష్టించింది. మరమ్మతు కోసం ఇచ్చిన సీపీయూలోకి చిన్నపాటి పాము చొరబడింది. విషయం తెలియక రిపేర్ చేసేందుకు మెకానిక్ ప్రయత్నించగా... పాము బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది.

వెంటనే పాములు పట్టే కాళీ చరణ్‌ అనే వ్యక్తిని పిలిపించారు. అనంతరం సీపీయూలోని పామును బయటకు తీశారు. తెలుపు, నలుపు మచ్చలు కలిగిన సర్పాన్ని క్షేమంగా.. సమీప అడవుల్లో విడిచిపెట్టారు.

ఇవీ చూడండి:స్వచ్ఛతే ఆరోగ్య సోపానం.. అవగాహనే కీలకం

ABOUT THE AUTHOR

...view details