ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఫ్రిజ్‌లో దూరిన ఓ పాము అందరిని హడలెత్తించింది. పాసర్లపూడి లంక గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో.. కూరగాయలు తీసుకునేందుకు మహిళ ఫ్రిజ్ డోరు తీయగా.. బుసలు కొడుతున్న తాచుపాము దర్శనమిచ్చింది. ఉలిక్కిపడిన ఆమె... డోరు వేయకుండానే భయంతో పరుగులు తీసింది. ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించినా.. దొరక్కపోవడంతో ఇంట్లోవారు, స్థానికులు భయంతో అల్లాడిపోయారు.
snake: ఫ్రిజ్ డోర్ తెరవగానే లోపల నల్లత్రాచు బుసలు కొడుతోంది!
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాసర్లపూడి లంక గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లోని ఫ్రిజ్‌లోకి నల్లత్రాచుపాము దూరింది. దీంతో వారు కంగారుపడ్డారు. కొద్దిసేపటికి స్నేక్ క్యాచర్ పామును పట్టుకున్నారు.
snake-in-fridge-at-pasarlapudi
స్థానికంగా ఉండే పాములు పట్టే వ్యక్తి ప్రకాశరావు వచ్చి.. చాకచక్యంతో పామును పట్టి సంచిలో బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తాచుపామును జనసంచారం లేని ప్రాంతంలో విడిచిపెట్టినట్టు స్థానికులు తెలిపారు.