Snake Attack: పాము పగ పడుతుందా..? వెంటాడి, వేటాడి కాటేస్తుందా..? ఇదంతా వట్టి బుర్రకథేనని కొట్టి పారేస్తారు. కానీ ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఓ కుటుంబాన్ని పాము పగబట్టినట్లుగా.. నెల రోజుల వ్యవధిలో ఆరు సార్లు కాటేసింది. సకాలంలో స్థానికులు స్పందించి ఆస్పత్రికి తరలిస్తుండటంతో ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. సోమవారం ఉదయం మరోసారి అదే కుటుంబంలో ఇద్దరు పాము కాటుకు గురై చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం మరోసారి అదే కుటుంబంలో ఇద్దరు పాము కాటుకు గురై చికిత్స పొందుతున్నారు. డోర్ణకంబాల పంచాయతీకి చెందిన వెంకటేశ్, వెంకటమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు జగదీశ్‌తో పాటు డోర్ణకంబాల గ్రామానికి చివరన గల కొండకింద భాగాన జీవిస్తుంటారు.
Snake Attack: పగబట్టిన పాము.. ఒక నెలలో ఆరు సార్లు కాటేసింది.!
Snake Attack: పాము పగబడితే ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. కానీ నిజ జీవితంలోనూ అలా జరుగుతుందా అంటే చెప్పలేము. కొందరు ఇవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టిపారేస్తారు. మరికొందరు దోషమేదైనా ఉందేమోనని దోష నివారణ పూజలు చేయిస్తారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఓ కుటుంబాన్ని పాము కాటేసిన తీరు చూస్తుంటే మాత్రం వారిపై పగబట్టిందా అనే సందేహం రాక మాత్రం మానదు. ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులను ఒక నెలలో ఆరు సార్లు కాటేసింది. సకాలంలో స్థానికులు స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
అయితే గత నెలలో వెంకటేశ్, వెంకటమ్మ, జగదీశ్‌లను రెండేసి సార్లు పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి 108 నంబరుకు కాల్ చేసి.. ఆస్పత్రికి తరలించడంతో ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. ఆ ప్రాంతంలో వారికి పాముల బెడద ఉన్నప్పటికీ... బతుకుదెరువును వదులుకొని వెళ్లలేక అక్కడే జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంకటమ్మ, జగదీశ్‌లను సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాము కాటేసింది. ఆ వెంటనే స్థానికులు 108కి కాల్ చేసి.. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాముల బెడద నుంచి కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రకాశ్‌రాజ్‌కు రాజ్యసభ సీటు?