సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ నివాసంలో పాము కలకలం సృష్టించింది. లక్డీకాపూల్ పోలీసు క్వార్టర్స్‌లోని సీపీ నివాసంలో ఈ ఉదయం పాము చొరబడింది. ఇది గమనించిన సజ్జనార్ పాములు పట్టే వ్యక్తిని పిలిపించగా..సర్పాన్ని పట్టుకున్నాడు. అనంతరం పామును నెహ్రు జూపార్కు అధికారులకు అప్పగించారు. పామును పట్టుకున్న వెంకటేశ్ నాయక్‌కు సజ్జనార్ నగదు పురస్కారం అందజేశారు.
సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం - సీపీ సజ్జనార్ వార్తలు
ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. పేరు చెబితేనే చాలా మంది నేరస్థులు వణికిపోతారు. అలాంటి వ్యక్తి ఇంట్లోకి పాము చొరబడింది. ఇల్లాంతా తిరిగేసింది. అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. మరి ఆ సమయంలో ఆ పోలీసు అధికారి ఏం చేశారో తెలుసా?
సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం