హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్లల్లో ఈ నెల 30 నుంచి మూడురోజుల పాటు అంతర్జాతీయ అల్పాహార ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. నాగోల్, అమీర్‌పేట్, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇథియోఫియా, అర్జెంటీనా, స్పెయిన్, దక్షిణ కొరియా, సూడాన్, స్విట్జర్లాండ్‌తో పాటు 15 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారన్నారు. కేవలం ఇళ్లల్లో తయారుచేసిన వంటకాలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి నెలా వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో మెట్రోస్టేషన్లలో సైన్స్ ఎగ్జిబిషన్స్ ఏర్పాటుచేస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు.
ఈనెల 30 నుంచి మెట్రో స్టేషన్లలో అల్పాహార ఉత్సవాలు - food festival
ఈనెల 30 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ మెట్రోస్టేషన్లలో అంతర్జాతీయ అల్పాహార ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. నాగోల్, అమీర్‌పేట్, హైటెక్‌సిటీ, ఎంజీబీఎస్ స్టేషన్లలో వేడుకలు నిర్వహిస్తామన్నారు.
ఈనెల 30 నుంచి మెట్రో స్టేషన్లలో అల్పాహార ఉత్సవాలు