తెలంగాణ

telangana

ETV Bharat / city

స్పైస్‌జెట్‌ విమానంలో పొగలు.. 28 నిమిషాల పాటు ఆకాశంలోనే చక్కర్లు.. చివరికి!

Smoke on Spice Jet plane: గోవా నుంచి హైదరాబాద్​ వస్తున్న స్పైస్​ జెట్​ విమానంలో పొగలు కమ్ముకున్నాయి. దీంతో అందులో ప్రయాణిస్తోన్న 86 మంది ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దాదాపు 28 నిమిషాల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Spice Jet plane
స్పైస్​ జెట్​ విమానం

By

Published : Oct 13, 2022, 8:37 AM IST

Smoke on Spice Jet plane: స్పైస్ జెట్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం ఆకాశంలో ఉండగానే లోపల పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ ఎస్​జీ 3735 విమానంలో పొగలు వ్యాపించాయి. ఆ పొగతోనే దాదాపు 28 నిమిషాలపాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. విమానంలో పొగలు రావడంతో అందులో ప్రయాణిస్తున్న 86 మంది ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు. చివరికి విమానం శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ రన్​వే చివరలో పైలట్​ అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీనితో విమానంలో ఉన్న 86 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు అస్వస్థతకు గురైంది. ఆమెకు ఎయిర్ పోర్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు స్పైస్ జెట్ శంషాబాద్​ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ నేపథ్యంలో 9 విమానాలను అధికారులు దారిమళ్లీంచారు. వీటిలో ఆరు డొమెస్టిక్ విమానాలు, ఒక కార్గో విమానం, రెండు అంతర్జాతీయ విమానాలను బెంగళూరు, చెన్నైకి దారి మళ్లించారు. 6E 684, 6E 6298, UK 871, SG 162, 6E 278, 6E 156 డొమెస్టిక్ విమానాలు, రియాద్ నుంచి వస్తున్న AI 942 విమానం, మలేషియా నుంచి వస్తున్న AK 069 విమానం దారిమళ్లించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details