తెలంగాణ

telangana

ETV Bharat / city

హెచ్​ఆర్​సీని ఆశ్రయించిన చిరువ్యాపారులు - Hrc latest updates

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ వ్యాపార సముదాయాలను తొలగించారని చిరు వ్యాపారులు ఆరోపించారు.

హెచ్​ఆర్​సీని ఆశ్రయించిన చిరువ్యాపారులు
హెచ్​ఆర్​సీని ఆశ్రయించిన చిరువ్యాపారులు

By

Published : Dec 15, 2020, 10:28 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా తొలగించినట్లు చిరు వ్యాపారులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్​కు చిరు వ్యాపారులు వినతిపత్రం ఇచ్చారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారి పక్కన నాలుగు రోజుల క్రితం రెవెన్యూ, గ్రేటర్, పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్న ఆక్రమణలు తొలగించారు. వీటితో పాటు జాతీయ రహదారికి 100 అడుగుల దూరంలో వేసుకున్న చిరువ్యాపార సముదాయాలను కూడా అధికారులు తొలగించారు.

తాము నిబంధనల పరిధిలోకి రాకపోయినప్పటికీ... ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వ్యాపార సముదాయాలను తొలగించారని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ హెచ్​ఆర్​సీని ఆశ్రయించారు.

ఇదీ చదవండి:రేపు దిల్లీ వెళ్లనున్న ఎంపీ రేవంత్​ రెడ్డి.. పీసీసీ కోసమేనా?

ABOUT THE AUTHOR

...view details