ఎన్నికల ప్రచారంలో నాయకులు పోలింగ్ శాతాన్ని పెంచాలని నాయకులు పదేపదే విజ్ఞప్తి చేసినా... ఓటర్లు మాత్రం అంతగా శ్రద్ధ కనబర్చడం లేదు. పాతబస్తీలో ఉదయం నుంచి కూడా పోలింగ్ మందకొడిగానే సాగుతోంది. సాయంత్రం 4గంటల వరకు కేవలం 29.4శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా 20మంది అభ్యర్ధులు పోటీలో ఉన్న జంగమెట్ డివిజన్‌లో మాత్రం అభ్యర్ధులు ఎవరికి వారు తమకు ఓటు వేయించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో పోలింగ్ బూతుల వద్ద భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూలో నిలబడి కనిపించారు.
ఎంత చెప్పినా అంతే.. పాతబస్తీలో మందకొడిగా పోలింగ్ - పాతబస్తీలో పోలింగ్
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్, జీహెచ్ఎంసీ, రాజకీయ పార్టీలు ఎంత అవగాహన కల్పించినా... ఓటర్లు మాత్రం తమకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు కేవలం 29.4శాతం మాత్రమే నమోదైంది. పాతబస్తీలో ఉదయం నుంచి పోలింగ్ మందకొడిగానే సాగుతోంది.
ఫలక్‌నుమా, బహదూర్‌పురా, మూసాబౌలి, ఘాన్సీబజార్, మోతీగల్లీ, సెట్విన్ పోలింగ్ బూత్ తదితర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అశ్వక దళాలు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నాయి. వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా... ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో గెలిచిన వారు ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. పోలింగ్ సమయంలో దగ్గర పడుతుండటం వల్ల అభ్యర్థులు తమకు ఓట్లు వేయించుకొనేందుకు యత్నిస్తున్నారు. ఆయా పోలీస్ కేంద్రాల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:మీ ప్రాంతంలో పోలింగ్ ఎంతో తెలుసుకోండి