తెలంగాణ

telangana

ETV Bharat / city

క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు - AP corona News

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 13,756 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,73,622 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో పశ్చిమగోదావరి జిల్లాలో 20 మంది మృతి చెందారు.

corona cases
కాస్త ఉపశమనం: క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

By

Published : May 29, 2021, 7:00 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 13,756 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 20,392 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,73,622 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 79,564 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మృతులు

కరోనాతో పశ్చిమగోదావరి జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 13 మంది, విశాఖ జిల్లాలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 8 మంది చొప్పున మృతిచెందారు.

జిల్లాల వారీగా కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో 2,301, చిత్తూరు జిల్లాలో 2,155, పశ్చిమగోదావరి జిల్లాలో 1,397, అనంతపురం జిల్లాలో 1,224, విశాఖ జిల్లాలో 1,004, నెల్లూరు జిల్లాలో 865 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: Investigation : రాష్ట్రంలో వ్యాక్సిన్ల వృథాపై విజిలెన్స్ విచారణ

ABOUT THE AUTHOR

...view details