Skill Development case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ సీఈవో గంటా సుబ్బారావు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ మేరకు విజయవాడ అ.ని.శా. కోర్టులో రూ.2 లక్షలు విలువచేసే పూచీకత్తును సుబ్బారావు తరఫున న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ సమర్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో ఏ1గా ఉన్న సుబ్బారావు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
సోమవారం బెయిల్ మంజూరు
Ganta SubbaRao released on bail: స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ సీఈవో గంటా సుబ్బారావుకు సోమవారం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ పోలీసులకు సుబ్బారావు అందుబాటులో ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతి శనివారం ఉ.10 నుంచి మ.1 వరకు అందుబాటులో ఉండాలని సూచించింది. సుబ్బారావును విచారించాలనుకుంటే ఒకరోజు ముందుగా సీఐడీ నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది.