తెలంగాణ

telangana

ETV Bharat / city

boy raped old women: వృద్ధురాలిపై అత్యాచారం.. మరో బాలికపైనా.! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఆమెకు సమీప బంధువైన బాలిక.. అవ్వకోసం భోజనం తీసుకువచ్చిన సమయంలో బాలికపైనా లైంగిక దాడి చేసేందుకు యత్నంచాడు. అప్రమత్తమైన బాలిక కేకలు వేయడంతో.. పారిపోయాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది.

BOY RAPES OLD WOMAN
BOY RAPES OLD WOMAN

By

Published : Oct 4, 2021, 7:36 PM IST

ఓ వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి (boy raped oldage women)పాల్పడ్డాడు. ఆమె మనుమరాలుపైనా..(boy trying to rape 6 years of age girl ) అత్యాచారం చేసేందుకు విఫలయత్నం చేశాడు. ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది.

పలమనేరు పట్టణంలోని వైఎస్సార్​ కాలనీలో ఓ వృద్ధురాలు(80) ఒంటరిగా ఉంటోంది. ఆమె సమీప బంధువులు అక్కడకు దగ్గర్లోనే మరోచోట నివాసం ఉంటున్నారు. అదే కాలనీలో చెందిన 16 ఏళ్ల బాలుడు శనివారం.. మధ్యాహ్నం కదలలేని స్థితిలో మంచంపై ఉన్న వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గంట తరువాత వృద్ధురాలి కోసం భోజనం తీసుకువచ్చిన ఆమె మనుమరాలు(6)పైనా అత్యాచారం (sexual assault on 6 years girl) చేసేందుకు యత్నించాడు. సదరు బాలిక కేకలు పెట్టడంతో అక్కడ నుంచి పారిపోయాడు.

పొరుగూరిలో పనులు చూసుకుని ఆదివారం ఇంటికి వచ్చిన తండ్రికి.. వృద్ధురాలిపై జరిగిన అఘాయిత్యం సహా తన మీద జరిగిన యత్నాన్ని గురించి ఆ ఆరేళ్ల బాలిక చెప్పింది. వెంటనే బాలిక తండ్రి... పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు వృద్ధురాలు, బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పలమనేరు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details