తెలంగాణ

telangana

ETV Bharat / city

Disha Encounter Case: రేపు.. సిర్పూర్కర్ కమిషన్ ఎదుటకు మహేశ్ భగవత్!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసు నిందితుల ఎన్​కౌంటర్(Disha Encounter Case)​పై సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) మలి విడత విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 25 వరకు పలువురు సాక్ష్యులను కమిషన్ విచారించనుంది. ఈ కేసులో సిట్​కు నేతృత్వం వహించిన మహేశ్​ భగవత్​ను బుధవారం రోజు విచారించే అవకాశం ఉంది.

sirpurkar commission
sirpurkar commission

By

Published : Sep 21, 2021, 12:20 PM IST

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్​కౌంటర్​(Disha Encounter Case)​పై సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) విచారణ వేగవంతం చేసింది. నేటి నుంచి మలివిడత విచారణ ప్రారంభించనుంది. ఈనెల 25వరకు ఇది కొనసాగనుంది. ఇప్పటికే మూడు విడతలుగా కమిషన్(Sirpurkar Commission) విచారణ చేపట్టింది.

హోంశాఖ కార్యదర్శి రవిగుప్తతో పాటు సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని కమిషన్(Sirpurkar Commission) విచారించింది. సురేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన కమిషన్.. ఆయనపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించింది. అఫిడవిట్​లోని పలు అంశాలను ప్రస్తావించగా.. కొన్నింటికి సురేందర్ రెడ్డి సమాధానం చెప్పలేదు.

దిశ కేసు(Disha Encounter Case)లో ఎన్​కౌంటర్​ అయిన నిందితుల కుటుంబ సభ్యుల నుంచి కమిషన్(Sirpurkar Commission) వాంగ్మూలం సేకరించింది. మృతులు చదివిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులనూ ప్రశ్నించింది. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉండటం వల్ల వారి వయసుకు సంబంధించి వివరాలు ఆరా తీసింది. పంచనామాలో పాల్గొన్న పలువురు అధికారులను సిర్పూర్కర్ కమిషన్ విచారించింది.

ఇప్పటికే ఈ కేసులో 14 మందిని విచారించిన కమిషన్(Sirpurkar Commission).. నేటి నుంచి జరిగే విచారణలో మరి కొంతమందిని ప్రశ్నించనుంది. సిట్​కు నేతృత్వం వహించిన మహేశ్​ భగవత్​ను కూడా బుధవారం రోజు విచారించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details