Sirpurkar Commission Report : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. 47 రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కమిషన్.. ఈనెల 28న సుప్రీంకు నివేదిక అందించింది. ఈ కేసుకు సంబంధించి కమిషన్.. అప్పటి సీపీ సజ్జనార్, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, శంషాబాద్ డీసీపీతో పాటు పలువురు పోలీసులు అధికారులు, ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను విచారించింది.
Sirpurkar Commission Report : దిశ నిందితుల ఎన్కౌంటర్.. సజ్జనార్ పాత్రపై సుప్రీంకు నివేదిక
12:12 January 31
సుప్రీం కోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక
Disha Culprits Encounter : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులు పోలీసులపై కాల్పులు జరపడం వల్ల ఎన్కౌంటర్ చేసినట్లు అప్పటి సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసుపై రాచకొండ సీపీ ఛైర్మన్‌గా సిట్ కూడా ఏర్పాటైంది. అనంతరం 2019 డిసెంబర్ 12న సుప్రీం కోర్టు.. సిర్పూర్కర్ కమిషన్‌ను నియమించింది.
Disha Culprits Encounter Case : 2019 డిసెంబరు 6న... దిశ అత్యాచార నిందితులు నలుగురు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాయారు. ఆ ఎన్కౌంటర్ జరిగిన విధానంపై నిజనిర్ధారణ చేసేందుకు సిర్పూర్కర్ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. నిందితుల కుటుంబసభ్యులు, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు సహా సంబంధిత అధికారులను విచారించింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు పరిశీలించింది. 57 మంది సాక్షులను విచారించినట్లు నివేదికలో పేర్కొంది.
సంబంధిత కథనాలు :
- Sirpurkar Commission : చటాన్‌పల్లిలో సిర్పుర్కర్ కమిషన్ బృందం పర్యటన
- Justice sirpurkar commission : 'నిందితులు మాపై కాల్పులు జరపడం వల్లే మేం ఫైరింగ్ చేశాం'
- disha encounter case: 'బుల్లెట్ గాయాలు పరిశీలించకుండా మృతదేహాలను పలకరించేందుకు వెళ్లారా?'
- justice sirpurkar commission: దిశ హత్యాచార కేసును శంషాబాద్ డీసీపీనే పర్యవేక్షించారు: సజ్జనార్
- Sirpurkar Commission Enquiry: దిశ కేసు.. '12 మంది కళ్లలో మట్టి కొట్టాడు'!
TAGGED:
Sirpurkar Commission Report