దిశ(disha case) నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) తన విచారణను వేగవంతం చేసింది. నేడు విచారణకు మృతుల కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. వారి నుంచి కమిషన్.. వాంగ్మూలం తీసుకోనుంది.
Sirpurkar Commission : 'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో విచారణ వేగవంతం - Sirpurkar Commission updates
దిశ(disha case) నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో విచారణను సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) ముమ్మరం చేసింది. కమిషన్ ముందుకు మృతుడు చెన్నకేశవులు భార్య హాజరయ్యారు. కమిషన్ సభ్యులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ఇప్పటికే ఈ కమిషన్(Sirpurkar Commission).. మృతుడు ఆరిఫ్ తండ్రి హుస్సేన్ నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుంది. నేడు మృతుడు చెన్నకేశవులు భార్య రేణుక.. కమిషన్ ముందుకు హాజరవ్వగా.. అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది సురేందర్ రావు.... రేణుకను ప్రశ్నించారు. హత్యాచారం, ఎన్‌కౌంటర్ అనంతరం జరిగిన పరిణామాల గురించి అడిగారు. అఫిడవిట్లో దాఖలు చేసిన అంశాల్లో కొన్నింటిని లేవనెత్తగా.... ఆమె వాటికి సమాధానమిచ్చారు.
జొల్లు నవీన్, జొల్లు శివ కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ సభ్యులు వాంగ్మూలం తీసుకోనున్నారు. ఆ తర్వాత సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్‌ను కమిషన్, విచారించే అవకాశం ఉంది. అఫిడవిట్ దాఖలు చేసిన సజయను సోమవారం నాడు.. కమిషన్(Sirpurkar Commission) విచారించింది. విచారణలో సజయ ఈ ఎన్‌కౌంటర్ బూటకమని కమిషన్‌కు తెలిపారు.