దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) విచారణ కొనసాగుతోంది. మృతుల కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ సభ్యులు వాంగ్మూలం సేకరిస్తున్నారు. ఆరిఫ్ తండ్రి హుస్సేన్, చెన్నకేశవులు భార్య రేణుక నుంచి ఇదివరకే వాంగ్మూలం తీసుకున్నారు. చెన్నకేశవులు, శివ వయసు గురించి ప్రభుత్వ తరఫు న్యాయవాది సురేందర్ రావు... జక్లేర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించారు. పాఠశాల రికార్డుల్లో వయసు దగ్గర దిద్ది ఉండటాన్ని సురేందర్ రావు ప్రశ్నించారు.
Sirpurkar Commission : దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో కొనసాగుతున్న విచారణ
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్(Sirpurkar Commission) విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆరిఫ్ తండ్రి హుస్సేన్, చెన్నకేశవులు భార్య రేణుక నుంచి వాంగ్మూలాలు సేకరించిన అధికారులు నేడు జొల్లు నవీన్, జొల్లు శివ కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకోనుంది.
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో కొనసాగుతున్న విచారణ
గ్రామాల్లో తల్లిదండ్రులు నిరక్ష్యరాసులవ్వడం వల్లన తమ పిల్లల వయసు సరిగ్గా చెప్పరని... సంబంధిత పత్రాలు తెచ్చినప్పుడు దాని ప్రకారమే విద్యార్థుల వయసు నమోదు చేస్తామని ప్రధానోపాధ్యాయుడు కమిషన్ (Sirpurkar Commission) ఎదుట తెలిపారు. జొల్లు నవీన్, జొల్లు శివ కుటుంబ సభ్యుల నుంచి కమిషన్ ఈరోజు వాంగ్మూలం తీసుకోనుంది.
మృతుల కుటుంబ సభ్యుల విచారణ అనంతరం కమిషన్ అధికారులు(Sirpurkar Commission) .. సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్‌ను విచారించే అవకాశం ఉంది.