తెరాసకు సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. సొంత ఖర్చులతో విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో ఆయన నివాసంలో ఉద్యోగులు భేటీ అయ్యారు.
మద్దతుపై లిఖిత పూర్వకంగా వినోద్‌కు లేఖను అందజేశారు. సింగరేణి ఉద్యోగులను వినోద్ కుమార్ అభినందించారు. నాలుగు ఉమ్మడి జిల్లాలోని 9 మున్సిపాలిటీల పరిధిలో దాదాపు లక్ష మంది ఓటర్లుగా సింగరేణి ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు.