తెలంగాణ

telangana

ETV Bharat / city

Singareni News : ఆ రోజుల్లో కూడా తగినంత బొగ్గు సరఫరా చేయాలి - సింగరేణి వార్తలు

Singareni News : కార్మిక సంఘాలు ఈ నెల 28, 29 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యుదుత్పత్తికి అంతరాయం కలగకుండా బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని సింగరేణి సంచాలకులు ఏరియా జీఎంలకు సూచించారు. సింగరేణితో బొగ్గు సరఫరా ఒప్పందం చేసుకున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సమ్మె జరగనున్న రోజుల్లో కూడా తగినంత బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Singareni News
Singareni News

By

Published : Mar 26, 2022, 6:58 AM IST

Singareni News : ఈనెల 28, 29న కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సింగరేణి సంస్థతో బొగ్గు సరఫరా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం మేరకు సమ్మె జరగనున్న రోజుల్లో కూడా ఆ కేంద్రాలకు తగినంత బొగ్గు రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి సంచాలకులు ఎస్. చంద్రశేఖర్​, ఎన్. బలరామ్, డి. సత్యనారాయణ రావులు ఏరియా జీఎంలను ఆదేశించారు.

సమ్మె నోటీసు నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో బొగ్గుఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాధారణం కంటే అధికంగా బొగ్గుఉత్పత్తిని సాధించాల్సి ఉంటుందని, ఈ దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అన్ని ఏరియాల జీఎంలు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details