తెలంగాణ

telangana

ETV Bharat / city

రోజుకు లక్ష టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి చేయాలి: సీఎండీ - సింగరేణి అధికారులతో సీఎండీ శ్రీధర్​ సమీక్ష

హైదరాబాద్​ సింగరేణి భవన్​లో సింగరేణి అధికారులతో... సీఎండీ శ్రీధర్​ సమావేశమయ్యారు. రాబోయే మూడు నెలల్లో ఉత్పత్తి చేయాల్సిన బొగ్గు, దాని రవాణాకు సంబంధించి... లక్ష్యాలు నిర్దేశించారు.

singareni cmd review with officials on increase coal production
రోజుకు లక్ష టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి చేయాలి: సీఎండీ

By

Published : Sep 4, 2020, 5:03 AM IST

బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతున్నందున... నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని సింగరేణి ఏరియా మేనేజర్లను సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. సింగరేణి భవన్​లో డైరక్టర్లు, సలహాదారులు, ఏరియా జీఎంలతో... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై లక్ష్యాలు నిర్దేశించారు. ఈ నెలలో రోజుకు లక్ష 30వేల టన్నులు, వచ్చే నెలలో లక్ష 50వేల టన్నులు.. నవంబరులో లక్ష 60వేల నుంచి లక్ష 80వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణ జరగాలన్నారు.

ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో ఓబీ తవ్వకాలు మరింత పెరగాలని.. రోజుకు 13 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీని తొలగించాలని ఆదేశించారు. రామగుండం-1 ఏరియాలో ప్రారంభించనున్న జీడీకే-5 ఓసీ గనికి... అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి జనవరిలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్పత్తి అయిన బొగ్గు పూర్తిగా రవాణా జరిగేలా మార్కెటింగ్‌ శాఖ కృషి చేయాలని ఆదేశించారు. సింగరేణి ఏరియాల్లో కరోనా నివారణ చర్యలు చేపట్టినట్టు శ్రీధర్ తెలిపారు.

ఇదీ చూడండి:'చైనా దూకుడుకు కళ్లెం వేసే శక్తి భారత్​కు ఉంది'

ABOUT THE AUTHOR

...view details