తెలంగాణ

telangana

ETV Bharat / city

ముగిసిన సింగమనేని నారాయణ అంత్యక్రియలు - kanaganapalle latest news

ప్రముఖ సాహితీవేత్త సింగమనేని నారాయణ అంత్యక్రియలు ఏపీలోని అనంతపురం జిల్లాలో నిర్వహించారు. సింగమనేని మృతి పట్ల ప్రముఖులు, సాహితీవేత్తలు, భాషా పండితులు విచారం వ్యక్తం చేశారు. సమాజంలోని రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం తెచ్చిన గొప్ప సాహితీవేత్తగా ఆయనను కొనియాడారు.

singmaneni narayana
ముగిసిన సింగమనేని నారాయణ అంత్యక్రియలు

By

Published : Feb 26, 2021, 10:51 PM IST

అభ్యుదయ సాహితీవేత్త సింగమనేని నారాయణ అంత్యక్రియలు అనంతపురం జిల్లా కనగానపల్లెలో పూర్తయ్యాయి. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఈనెల 15న అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన... చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయన భౌతికకాయం ఉంచిన ప్రత్యేక వాహనం వెంట ప్రముఖులు, సాహితీవేత్తలు, కవులు.. కనగానపల్లె వరకు అంతిమయాత్ర నిర్వహించారు.

కనగానపల్లెలో సింగమనేని కుటుంబానికి చెందిన వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. సింగమనేని నారాయణ మృతి పట్ల ప్రముఖులు, సాహితీవేత్తలు, భాషా పండితులు నివాళులర్పించారు. సమాజంలోని రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం తెచ్చిన గొప్ప సాహితీవేత్తగా సింగమనేనిని ప్రముఖులు కొనియాడారు.

ఇవీచూడండి:ప్రముఖ కవి సింగమనేని నారాయణ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details