తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రముఖ కవి సింగమనేని నారాయణ మృతి

ఏపీలోని అనంతపురం జిల్లా బండమీదపల్లికి చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త సింగమనేని నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

By

Published : Feb 25, 2021, 7:20 PM IST

ప్రముఖ కవి సింగమనేని నారాయణ మృతి
ప్రముఖ కవి సింగమనేని నారాయణ మృతి

ఏపీలోని అనంతపురం జిల్లా బండమీదపల్లికి చెందిన సింగమనేని నారాయణ మృతిచెందారు. నారాయణ ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాసను విడిచారు. ఆయన పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు, రచయితలు నివాళులర్పించారు.

సింగమనేని నారాయణ ఇప్పటి వరకు 43కు పైగా కథలు రాశారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. రేపు ఉదయం శ్రీనివాస్​నగర్​లో అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.

ఇదీ చదవండి: సాగుచట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేదు: ఆర్​.నారాయణమూర్తి

ABOUT THE AUTHOR

...view details