ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవ స్వరూపం.. సింహచల వరహా లక్ష్మీ నరసింహస్వామి.. వైకుంఠ ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఛైర్పర్సన్ సంచయిత గజపతి.. స్వామి వారిని దర్శించుకున్నారు. స్వర్ణ కవచ అలంకారంలో స్వామివారు కనువిందు చేశారు.
స్వర్ణ కవచాలంకరణలో దర్శనమిచ్చిన సింహాచలేశుడు - సింహాద్రి అప్పన్న దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
వైకుంఠ ఏకాదశి సందర్బంగా విశాఖలోని సింహాచల వరహా లక్ష్మీనరసింహస్వామి.. భక్తులకు స్వర్ణ కవచ అలంకారంలో దర్శనమిచ్చారు. తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు.. అప్పన్నస్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
స్వర్ణ కవచాలంకరణలో దర్శనమిచ్చిన సింహాచలేశుడు
దేవి సమేత వరాహ లక్ష్మీ నరసింహుడుగా దర్శనమిచ్చి.. అనంతరం మూల విరాట్‌ను దర్శనం చేసుకునేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కొవిడ్ నియమాలు అనుసరిస్తూ భక్తులు దర్శనం చేసుకొనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇవీచూడండి:రాష్ట్రంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు