KTR Tweet on Modi: దేశ ప్రధాని మోదీపై ట్విటర్లో మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రానికి రావల్సిన నిధుల కేటాయింపులు, పొరుగు రాష్ట్రాలకు మోదీ కేటాయింపులపై తరుచూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోన్న కేటీఆర్.... తాజాగా మోదీకి నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదంటూ ఎద్దేవా చేశారు.
వైద్య, ఆర్థిక, శాంతి, భౌతిక శాస్త్ర రంగాల్లో మోదీకి నోబెల్ బహుమతికి అర్హుడు ఎందుకు కారాదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కొవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు చేయడంలో వైద్యరంగంలో నోబెల్ కు మోదీ ఇవ్వకూడాదా అంటూ ప్రశ్నించిన కేటీఆర్.... నోట్ల రద్దు, స్విస్ బ్యాంకు నుంచి మనీ రిటర్న్స్ కు గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ఇవ్వాలన్నారు. అలాగే 6 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు శాంతి బహుమతి ఇవ్వాలన్నారు. రాడార్ సిద్ధాంతానికిగాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి మోదీ అర్హుడంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.