ఏపీలో కొత్తగా 11,421 కరోనా(corona) కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,28,577కు చేరింది. మృతుల సంఖ్య 11,213కు పెరిగింది.
కరోనా నుంచి మరో 16,223 మంది బాధితులు కోలుకోగా.. వైరస్ను జయించిన వారి సంఖ్య 15,78,452గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,38,912 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 86,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు...
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,308 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 1,658, అనంతపురంలో 1,041, గుంటూరులో 669, కడపలో 602, కృష్ణాలో 841, కర్నూలులో 556,నెల్లూరులో 546, ప్రకాశంలో 607, శ్రీకాకుళంలో 465, విశాఖపట్నంలో 814, విజయనగరంలో 318, పశ్చిమగోదావరిలో 996 మందికి కరోనా నిర్ధరణ అయింది.
జిల్లాల వారీగా కరోనా మరణాలు...
కరోనాతో చిత్తూరులో 13, అనంతపురంలో 9, శ్రీకాకుళం లో 9, విజయనగరంలో 7, తూర్పుగోదావరిలో 6, నెల్లూరులో 6, విశాఖపట్నంలో 6, కృష్ణాలో 5, కర్నూలులో 5, పశ్చిమ గోదావరిలో 5, గుంటూరులో 4, ప్రకాశంలో 4, వైఎస్ఆర్ కడప లో 2 మరణాలు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు.
ఇదీచదవండి.