ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా వందలాది సర్కారు పాఠశాలల్లో కొరత(shortage of staff in schools) మాత్రం తీరలేదు. జిల్లాకు 150 నుంచి 200 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అయిదు వేల మందికి పైగా ఉపాధ్యాయులను వారు పనిచేసే మండల పరిధిలో తాత్కాలికంగా బదిలీ చేశారు. ఈసారి ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా ప్రభుత్వ బడుల్లో చేరడంతో ఉపాధ్యాయులు(shortage of staff in schools) సరిపోవడం లేదు. హేతుబద్ధీకరణ తర్వాత అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమిస్తామని విద్యాశాఖ చెబుతోంది. జీవో జారీ అయి రెండు నెలలైనా ఇప్పటివరకు హేతుబద్ధీకరణ మొదలు కాలేదు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగులను కేటాయించనంతవరకు అది సాధ్యం కాదని తెలుస్తోంది. ముందుగా విద్యా వాలంటీర్లను నియమించి, హేతుబద్ధీకరణ తర్వాత అవసరం లేదనుకుంటే తొలగించవచ్చని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి.
విద్యాశాఖ ఆలోచన వేరు...
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు సర్కారు బడుల్లో నమోదైనట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అందులో ప్రైవేటు నుంచి వచ్చిన వారు 2 లక్షల మంది. ఇంకా దాదాపు 2 లక్షల మంది వివరాలు ఛైల్డ్ ఇన్ఫో పోర్టల్‌లో నమోదు కాలేదు. విద్యార్థులు ఆధార్ సంఖ్య ఇచ్చినా పాత పాఠశాలలో పేరు తొలగిస్తేనే కొత్త బడుల్లో నమోదు చేయడం సాధ్యమవుతుంది. కేజీబీవీలు, ఇతర గురుకులాలు తెరిస్తే కొందరు వాటిలో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుది లెక్క తేలడానికి మరో నెల రోజులు పడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాతే అవసరమైతే వాలంటీర్లను తీసుకోవాలని యోచన. ఉపాధ్యాయుల కొరత(shortage of staff in schools)తో బోధన సరిగా సాగకుంటే, విద్యార్థులు వచ్చే ఏడాది మళ్లీ ప్రైవేటు బాట పట్టే పరిస్థితి వస్తుందని టీఎస్‌టీయూ, టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర నేతలు రాజిరెడ్డి, కటకం రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.