రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహాశివరాత్రి వేడుకలు రెండోరోజు కొనసాగాయి. శివసత్తుల పూనకాలు, డప్పుచప్పుళ్ల నడుమ మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో ఎండ్లబండ్ల ఊరేగింపు ఘనంగా సాగింది. కాళేశ్వరంలో మూడు రోజులపాటు జరిగిన ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరా స్వామి వారికి...మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సదస్యం, నాకబలి, పూర్ణాహుతి తదితర విశేష పూజలు నిర్వహించారు.
రాష్ట్రంలో రెండోరోజు కొనసాగిన మహాశివరాత్రి వేడుకలు - telangana varthalu
రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు రెండోరోజు కొనసాగాయి. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయలలో ఎండ్లబండ్ల ఊరేగింపు ఘనంగా జరిగింది.
రాష్ట్రంలో రెండోరోజు కొనసాగిన మహాశివరాత్రి వేడుకలు
వికారాబాద్ జిల్లా మందిపల్‌లో మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా...శివపార్వతులకు పల్లకిసేవ ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు కోలాట ప్రదర్శనలతో సందడిగా గడిపారు.
ఇదీ చదవండి: ప్రపంచ ఆలయాల్లో యాదాద్రి ప్రత్యేకత చాటుకోబోతోంది: సీఎం