ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో నేటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణ, అశ్వవాహన సేవ నిర్వహించనున్నారు. 10వ తేది ఉదయం గజవాహన సేవ, రాత్రి రావణ వాహన సేవ, 11న మహా శివరాత్రి సందర్భంగా.. ఉదయం సింహ వాహన సేవ, రాత్రి నంది వాహన సేవలు జరిపించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మహానందిలో నేటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - నేటి నుంచి మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వార్తలు
ఏపీలోని కర్నూల్ జిల్లా మహానందిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మహానందిలో నేటి నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
వాటితో పాటుగా రాత్రి పది గంటలకు లింగోద్భవ కాల మహా రుద్రాభిషేకం జరిపించి అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 12న ఉదయం మయూర వాహన సేవ, రాత్రి పుష్ప పల్లకి సేవ.. 13న వ్యాఘ్ర వాహన సేవ, మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి పుష్ప శయనోత్సవాలు జరిపిస్తారు. చివరి రోజైన 14వ తేదీన మహా పూర్ణాహుతి, నాగబలి పూజ, త్రిశుల స్నానం, ధ్వజ అవరోహణం వైభవంగా నిర్వహించి.. రాత్రి తెప్పోత్సవంతో ఉత్సవాలను ముగిస్తారు.
ఇదీ చదవండి:ఎన్నికల్లో ఎవరూ తప్పుడు ఓట్లు వేయొద్దు : కోదండరాం
TAGGED:
brahmotsavam mahanandi