మూడువైపులా శివుని రూపం, నాగుపాము పడగతో ఉన్న లోహపు శివలింగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో దొరకడం కలకలం రేపింది. మూడువైపులా శివుని ఆకారం నాగుపాము మరో ఆకారం కూడా ఉండడంతో పంచముఖ శివుని రూపం అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పాఠశాల ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని విద్యార్థులు గుర్తించారు.
కాగా విగ్రహం లభించిన ప్రాంతంలో ఉన్న గద్దె వంటి నిర్మాణంపై గతంలో శ్రీరామనవమి, వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. విగ్రహం లభించిన ప్రాంతం పాఠశాల పరిధిలో ఉండడంతో ఇటీవల చుట్టూ కంచె ఏర్పాటు చేసి బడి యాజమాన్యం మొక్కలను పెంచడం ప్రారంభించారన్నారు.