ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డులో ఈ నెల ఒకటిన జరిగిన ప్రమాదంపై నిపుణుల కమిటీ.. తన నివేదికను విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్‌కు సమర్పించింది. క్రేన్ డిజైనింగ్‌లోనే లోపాలున్నట్టు తేల్చిచెప్పింది. ఏయే ప్రమాణాలు పాటించారు, ఏ రకమైన క్రేన్ రూపొందించారు, తీసుకున్న జాగ్రత్తలేంటన్న అంశాలన్నింటినీ నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలించింది. లోడ్ టెస్టింగ్‌కు తీసుకోవాల్సిన కొన్ని కచ్చితమైన అనుమతులను తీసుకోలేదని గుర్తించింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా.. షిప్‌యార్డ్ యాజమాన్యంపై చర్యలు తీసుకునే అవకాశముంది.
షిప్‌యార్డ్ ప్రమాదం: 'క్రేన్ డిజైనింగ్‌లో లోపం వల్లే ప్రమాదం'
విశాఖ షిప్‌యార్డ్ ప్రమాదంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ తమ నివేదికను కలెక్టర్‌కు సమర్పించింది. క్రేన్ డిజైనింగ్‌లోనే లోపాలున్నట్టు గుర్తించింది. లోడ్ టెస్టింగ్‌కు అనుమతులు తీసుకోలేదని కమిటీ తెలిపింది.
షిప్‌యార్డ్ ప్రమాదం: 'క్రేన్ డిజైనింగ్‌లో లోపం వల్లే ప్రమాదం'