నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవేదన వ్యక్తం చేశారు. నల్లమల అటవీ ప్రాంతం సమూలంగా నాశమయ్యే ప్రమాదముందని ట్విట్టర్లో తన అభిప్రాయాలను వెల్లడించారు. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదితో పాటు, ఉపనదులు కాలుష్యం బారిన పడతాయని శేఖర్ కమ్ముల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నల్లమల అటవీ ప్రాంతాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయరాదని, నల్లమల అడవులను కాపాడాలని శేఖర్ కమ్ముల ట్విట్టర్ ద్వారా కోరారు.
నల్లమలలో యురేనియం తవ్వకాలపై శేఖర్ కమ్ముల ట్వీట్
నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆందోళన వ్యక్తం చేశారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలంటూ ట్వీట్ చేశారు.
నల్లమలలో యురేనియం తవ్వకాలపై శేఖర్ కమ్ముల ట్వీట్