తెలంగాణ

telangana

ETV Bharat / city

నటుడు సిద్దార్థ్​ మరణం.. షాక్​లో అతడి గర్ల్​ఫ్రెండ్! - sidharth death

నటుడు సిద్దార్థ్ శుక్లా మరణంతో అతడి గర్ల్​ఫ్రెండ్​ షాక్​లో ఉంది. జరిగిన విషయాన్ని అస్సలు నమ్మలేకపోతోంది! ఈ విషయాన్ని ఆమె తండ్రి వెల్లడించారు.

నటుడు సిద్దార్థ్​ మరణం.. షాక్​లో అతడి గర్ల్​ఫ్రెండ్!
నటుడు సిద్దార్థ్​ మరణం.. షాక్​లో అతడి గర్ల్​ఫ్రెండ్!

By

Published : Sep 3, 2021, 8:30 AM IST

బాలీవుడ్​ నటుడు, బిగ్​బాస్-13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మరణం.. అభిమానుల్నే కాకుండా సహనటీనటులను శోకాన్ని మిగిల్చింది. ఇక అతడి గర్ల్​ఫ్రెండ్ షెహనాజ్ గిల్​​ అయితే ప్రస్తుతం షాక్​లో ఉంది! జరిగిన విషయాన్ని అసలు నమ్మలేకపోతుందని ఆమె తండ్రి చెప్పారు.

"ఏం మాట్లాడే పరిస్థితిలో నేను లేను. అసలు జరిగిన విషయాన్ని నమ్మలేకపోతున్నా. మా అమ్మాయితో మాట్లాడాను. ముంబయిలోని తన దగ్గరకు నా కుమారుడు ఇప్పుడే వెళ్లాడు. నేను తర్వాత వెళ్తాను" అని షెహనాజ్ తండ్రి సంతోఖ్ సింగ్ తెలిపారు.

మోడల్​గా కెరీర్​ ప్రారంభించిన సిద్ధార్థ్ శుక్లా.. 'బబుల్ కా అంగన్ చోటే నా' టీవీ షోతో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత యే అజ్నాబ్బీ, లవ్​ యూ జిందగీ తదితర సీరియల్స్​లో నటించారు. కానీ 'బాలికా వధు'(చిన్నారి పెళ్లికూతురు) సీరియల్​ చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2014లో వచ్చిన 'హంప్టీ శర్మ కీ దుల్హానియా'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇవే కాకుండా బిగ్​బాస్ 13, 'జలఖ్ దిఖ్లా జా' 6, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడీ7 రియాలిటీ షోల్లోనూ పాల్గొన్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details