ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం హుసేనాపురంలోని ఉమామహేశ్వర ఆలయం 10వ వార్షికోత్సవం, మహా శివరాత్రి సందర్భంగా.. చెక్కభజన, పొట్టేలు, పందుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ఇచ్చారు.
అలరించిన చెక్కభజన, పొట్టేలు, పందుల పోటీలు - హుసేనాపురం ఉమామహేశ్వర ఆలయం 10వ వార్షికోత్సవం
మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం హుస్సేనాపురంలో నిర్వహించిన చెక్కభజన, పొట్టేలు, పందుల పోటీలు భక్తులను అలరించాయి. ఉమామహేశ్వర ఆలయం 10వ వార్షికోత్సవంతో పాటు పండగ కలిసి రావడంతో.. నిర్వాహకులు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విజేతలకు పెద్ద మొత్తంలో నగదు బహుకరించారు.
![అలరించిన చెక్కభజన, పొట్టేలు, పందుల పోటీలు sheep-and-pig-competitions-in-tadipatri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10984216-398-10984216-1615561467767.jpg)
అలరించిన చెక్కభజన, పొట్టేలు, పందుల పోటీలు
అలరించిన చెక్కభజన, పొట్టేలు, పందుల పోటీలు
ఒక్కో విభాగంలో పోటీల్లో గెలుపొందిన వారికి.. మొదటి బహుమతి కింద రూ.30 వేలు, రెండో బహుమతి రూ.25 వేలు, మూడో బహుమతి రూ.20 వేలు చొప్పున అందజేశారు. ఈ పోటీలు తిలకించేందుకు పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఇదీ చదవండి:బైక్ స్కీమ్ పేరుతో రూ. 54 లక్షలు మోసం..