తెలంగాణ

telangana

ETV Bharat / city

YS SHARMILA : ఇడుపులపాయలో వైఎస్​ఆర్​కు షర్మిల ఘన నివాళి

షర్మిల, అనిల్​కుమార్​ ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో ఈరోజు వైఎస్​ఆర్​ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం.. వైఎస్ షర్మిల తెలంగాణలో తాను పెట్టబోయే పార్టీని ప్రకటించబోతున్నారు.

Sharmila's tribute to YSR in Idupulapaya
ఇడుపులపాయ వద్ద వైఎస్​ఆర్​ విగ్రహానికి షర్మిల నివాళి

By

Published : Jul 8, 2021, 9:39 AM IST

దివంగత నేత వైఎస్​ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె షర్మిల.. ఇడుపుల పాయ వద్ద నివాళులర్పించారు. వైఎస్ ఘాట్​ వద్దకు విజయమ్మ, వైఎస్​ వివేకా కుమార్తె సునీత, అనిల్​ కుమార్​ చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఇడుపులపాయ వద్ద వైఎస్​ఆర్​ విగ్రహానికి షర్మిల నివాళి

రాజన్న సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమంటూ.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రంగ ప్రవేశం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీని ఈరోజు ఆమె ప్రకటించబోతున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేటకు చేరుకుంటారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు ఆమెకు స్వాగతం పలికేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. పంజాగుట్టలోని వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌ కేంద్రానికి చేరుకుంటారు షర్మిల.

ఐదు గంటలకు వేదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్‌ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ స్థాపన లక్ష్యాలు, ఎజెండాపై గంటా 15 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. తల్లి వైఎస్‌ విజయమ్మ, భర్త అనిల్‌కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇప్పటి వరకు కోర్‌ టీంగా ఉన్న కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, తూడి దేవేందర్‌రెడ్డి సభావేదికపై నుంచి జెండా ఆవిష్కరణలో పాలుపంచుకోనున్నారు. ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినట్టు.. వైఎస్​ఆర్​టీపీ ఆవిర్భావ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక కూడా తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. షర్మిలతోనే విభిన్న వర్గాలకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details