వైఎస్ఆర్ సంక్షేమ పాలన రాష్ట్రంలో తీసుకురావటమే లక్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారు. గతంలో వైఎస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని అన్నారు.
YSRTP: వైఎస్ఆర్ సంక్షేమ పాలన లక్ష్యంగా పార్టీ ఏర్పాటు: షర్మిల - షర్మిల వార్తలు
ఆగస్టు 5 నుంచి జెండా పండుగ నిర్వహిస్తామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. లోటస్ పాండ్లో పార్టీ జెండా ఎగరవేశారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన రాష్ట్రంలో తీసుకురావటమే లక్ష్యంగా పార్టీ పెట్టినట్లు చెప్పారు.
షర్మిల
ప్రజల పక్షాన పోరాడితే... వారు ఆదరిస్తారని, సమస్యలు గుర్తించి వాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన పార్టీ జెండా ఎగరేసి సంక్షేమ పాలన మళ్లీ తిరిగి రాబోతుందని అందరికీ చెప్పేందుకు జెండా పండుగలను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో జెండా పండుగ నిర్వహించే వారు సంబంధిత ఫొటోలను వాట్సాప్ చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:GRMB: జీఆర్ఎంబీ బోర్డు సమావేశానికి హాజరుకావటం లేదు: తెలంగాణ
Last Updated : Aug 5, 2021, 10:23 PM IST