శంషాబాద్ ఘటనను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతోన్నాయి. యువ పశువైద్యురాలి హత్యకేసులో నిందితులను ఉరితీయాలంటూ నిరసనకారులు చర్లపల్లి జైలు వద్ద నినాదాలతో హోరెత్తించారు. షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ నుంచి ప్రత్యేక వాహనాల్లో నిందితులను తీసుకొస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు, ప్రజాసంఘాల కార్యకర్తలు కారాగారం వద్దకు భారీగా తరలివచ్చారు. నిందితులు ఉన్న వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా జైలు వద్ద ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది.
ఆందోళనకారులపై లాఠీఛార్జి