తెలంగాణ

telangana

ETV Bharat / city

హుజూరాబాద్​ ఉప ఎన్నిక తర్వాత తెరాస పని అయిపోయినట్లే: షబ్బీర్​ అలీ - undefined

తెరాస ఎమ్మెల్యేలపై షబ్బీర్​ అలీ సంచలన వ్యాఖ్యలు
తెరాస ఎమ్మెల్యేలపై షబ్బీర్​ అలీ సంచలన వ్యాఖ్యలు

By

Published : Oct 24, 2021, 1:00 PM IST

12:54 October 24

హుజూరాబాద్​ ఉప ఎన్నిక తర్వాత తెరాస పని అయిపోయినట్లే: షబ్బీర్​ అలీ

హుజూరాబాద్ ఉప ఎన్నిక అనంతరం తెరాస పని అయిపోయినట్లేనని తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సుమారు 15 మంది తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్​కు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్​ ప్రజలు సిద్ధమయ్యారన్న షబ్బీర్​ అలీ.. ఈ ఉప ఎన్నిక ముగియగానే సీఎం కేసీఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ తప్పదన్నారు. తెలంగాణలో తెరాస పని అయిపోయిందని జోస్యం చెప్పారు.

హుజూరాబాద్ ప్రజలు తెరాసను పట్టించుకోవడం లేదు. దాంతో ఆ పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెరాస నేతలకు మతిభ్రమించిందని చెప్పడానికి వారు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం.-షబ్బీర్​ అలీ, తెలంగాణ కాంగ్రెస్​ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్​

ఇదీ చూడండి: REVANTH REDDY: త్వరలో తెరాసలో ముసలం ఖాయం: రేవంత్‌ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details