తెలుగుదేశం సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్‌లో నిర్భయ కేసు నమోదైంది. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు... 354a (iv), 500, 504, 505( 1) b, 505 (2), 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై 'నిర్భయ' కేసు
తెదేపా సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. తనను దూషించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మున్సిపల్ కార్యాలయంలో రుత్తల లత్స పాత్రుడు చిత్రపటం తొలగింపుపై బెదిరింపు ధోరణిలో మాట్లాడారని కమిషనర్ పేర్కొన్నారు. సమావేశ మందిరం నవీకరణ తర్వాత ఫొటో పెడతామన్న మాట నిలబెట్టుకోకపోతే... ఊరుకోనని తీవ్ర పదజాలం వాడినట్టు సామాజిక మాధ్యమాల్లో చూశానని కృష్ణవేణి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మాటలు తీవ్ర ఆవేదన కలిగించాయని... స్వేచ్ఛగా విధి నిర్వహణ చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇదీ చదవండి:హస్తకళాకారులకు కరోనా కష్టం