తెలంగాణ

telangana

ETV Bharat / city

Sex Positive Education: అలా సెక్స్​ చేస్తే.. పిల్లలు పుట్టరా? - SEX POSITIONS TO GET PREGNANT

Sex positions to get pregnant: రతిలో పురుషుడు కింద, స్త్రీ పైన ఉంటే.. పిల్లలు పుట్టరని కొంతమంది నమ్ముతారు. అయితే.. ఇందులో వాస్తవమెంత? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..?

Sex Positive Education: అలా సెక్స్​ చేస్తే.. పిల్లలు పుట్టరా?
Sex Positive Education: అలా సెక్స్​ చేస్తే.. పిల్లలు పుట్టరా?

By

Published : Mar 1, 2022, 10:21 AM IST

Sex positions to get pregnant: దంపతులు తమకు పిల్లలు కలగకపోవడానికి అనేక కారణాలను ఊహించుకుంటారు. అందులో ఒకటి సెక్స్​ పొజిషన్. శృంగార సమయంలో పురుషుడు కింద, మహిళ పైన ఉంటే.. పిల్లలు పుట్టరని చాలా మంది అనుకుంటారు. మరి ఇందులో వాస్తవమెంత అంటే..

Sex problems and solutions: కొంతమంది మహిళలు రతిలో తృప్తి కలిగేందుకు పై భాగంలో ఉండేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే.. కావాల్సిన విధంగా స్తంభించిన పురుషాంగాన్ని క్లైటోరిస్​కు, జీస్పాట్​కు తగినట్లుగా యాంగిల్స్​ మార్చుకుంటూ వారు అలా రతిలో తృప్తి పొందుతారు. దీనికి గర్భం దాల్చకపోవడానికి సంబంధం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీర్య కణాలు తక్కువగా ఉండడం, కణాలు కదలిక తక్కువగా ఉండడం, లేదా మహిళలో అండం విడుదల లేకపోవడం వంటి కారణాల వల్ల మాత్రమే పిల్లలు పుట్టరు అని వివరిస్తున్నారు. అంతేగానీ, ఉపరతి(మహిళపైన, పురుషుడు కింద) వల్ల మహిళ గర్భం దాల్చలేదు అనడం అవాస్తవమని స్పష్టం చేస్తున్నారు. వీర్యం యోనిమార్గంలో కలిస్తే తప్పక గర్భం వస్తుందని.. అది ఏ పొజిషన్లో ఉన్న కూడా సాధ్యమేనని చెబుతున్నారు.

ఇదీ చూడండి: రోజులో ఎన్ని సార్లు సెక్స్​లో పాల్గొనవచ్చు?

ABOUT THE AUTHOR

...view details