తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు పలు సంఘాలు మద్దతు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. మంత్రి హరీశ్ రావును కలిసిన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో... ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలని మంత్రి సూచించారు. తెరాస అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

trs
trs

By

Published : Mar 10, 2021, 7:21 PM IST

Updated : Mar 10, 2021, 7:27 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావును కలిసిన ఈడబ్ల్యూఐడీసీ, సర్వశిక్షాభియాన్ సిబ్బంది, ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సంఘం, తెలంగాణ హ్యూమన్ రైట్స్ కం మీడియా ఆర్గనైజేషన్, హైకోర్టు న్యాయవాదుల సంఘం మద్దతు తెలిపాయి. సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ నేతలు కూడా హరీశ్ రావును కలిసి మద్దతు ప్రకటించారు. భాజపా తెలంగాణకు ఏం చేసిందో గమనించాలన్న మంత్రి... కేంద్ర బడ్జెట్​లో తెలంగాణ రాష్ట్రానికి కోతలు - ప్రజలకు వాతలు పెట్టారని ఆక్షేపించారు.

జీడీపీ పెంచుతామని చెప్పి...

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన మొత్తంలో ఇరవై వేల కోట్లు రాష్ట్రానికి కోత విధించిందని హరీశ్​ రావు ఆరోపించారు. జీడీపీ పెంచుతామంటూ భాజపా ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిందని ఎద్దేవా చేశారు. భాజపా అధికారంలోకి వచ్చే ముందు రూ.300 ఉన్న గ్యాస్ ధర నేడు రూ.900కు పెరిగిందని... ఇక ముందు రూ.1,000 కావచ్చన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నవి భాజపా ప్రభుత్వం ఊడగొడుతుందని మండిపడ్డారు.

దుష్ప్రచారానికి ప్రభావితం కావొద్దు

ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో... ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలని మంత్రి సూచించారు. భాజపా దుష్ప్రచారానికి ప్రభావితం కాకుండా తెరాస అభ్యర్థి వాణీదేవిని తొలి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈడబ్ల్యూఐడీసీ సిబ్బందికి జీతం నెలనెలా వచ్చేలా చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. మంత్రి గంగుల కమలాకర్​ను కలిసిన రాష్ట్ర వయోజనవిద్య ఉద్యోగుల సంఘం... ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది.

ఇదీ చదవండి :సౌర విద్యుత్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది: హరీశ్‌రావు

Last Updated : Mar 10, 2021, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details