ఏపీ తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి... జీడిపప్పు పరిశ్రమకు ఎంతో పేరుంది. ఏళ్ల తరబడి సుమారు 2 వేల మంది కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ పరిశ్రమ మూత పడింది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వ్యాపారులు జీడిపిక్కలు తీసుకొచ్చి వాటిని డ్రమ్ములో కాల్చి కమ్మటి జీడిపప్పును ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ తయారైన జీడిపప్పును జిల్లాలోని కాకినాడ, రాజమండ్రితో పాటు విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. లక్షల్లో వ్యాపారం జరుగుతుండేది. వేసవి కాలం పెళ్లిళ్ల సీజన్లో ఈ పరిశ్రమకు మరింత డిమాండ్ ఉంటుంది. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమలు చేయడం వల్ల పరిశ్రమలు మూతపడ్డాయి.
రవాణా లేక పప్పు పురుగుల పాలవుతోంది...