ఒకేసారి ఏడుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన సంచలనం రేపింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏడుగురు విద్యార్థులు... చదవడం ఇష్టం లేదని, తమకు ఆటలు కావాలని ఇంటి నుంచి పారిపోయారు. బెంగళూరు బాగలగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉదయం పాఠశాలకు వెళ్తున్నామని వెళ్లిన విద్యార్థులు మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు ఓ లేఖ లభించింది. అందులో ‘మాకు చదువులంటే ఇష్టం లేదు. ఆటలంటేనే ప్రేమ అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి తెచ్చినా చదవాలని ఆసక్తి వారికి కలగట్లేదని లేఖలో వివరించారు.