జనవరిలో జరిగిన పురపోరులో కనీసం పదిశాతం అభ్యర్థులను పోటీలో నిలపనందున తెలంగాణ జనసమితి సహా ఏడు పార్టీలు ఉమ్మడి గుర్తును కోల్పోయాయి. తెలంగాణ జనసమితి, యువతెలంగాణ, జనశంఖారావం, బీసీ యునైటెడ్ ఫ్రంట్, ప్రజాసేన, సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీలకు జనవరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తులను కేటాయించింది.
ఉమ్మడి గుర్తును కోల్పోయిన తెజస సహా ఏడు పార్టీలు - tjs loss party symbol
తెజస సహా ఏడు రాజకీయ పార్టీలు తమ ఉమ్మడి గుర్తులను కోల్పోయినట్లు ఎస్ఈసీ ప్రకటించింది. రానున్న ఐదేళ్ల వరకు ఉమ్మడి గుర్తు కోసం సదరు పార్టీలు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.
seven political parties loss their common symbols
అప్పుడు జరిగిన పురపాలక ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున కనీసం పదిశాతం మంది అభ్యర్థులు బరిలో దిగనందున ఉమ్మడి గుర్తును కోల్పోయినట్లు ఎస్ఈసీ ప్రకటించింది. రానున్న ఐదేళ్ల వరకు అనగా... 2025 జనవరి వరకు ఉమ్మడి గుర్తు కోసం సదరు పార్టీలు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.