సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులుగా జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి ఏడుగురు పేర్లను సిఫార్సు చేసింది. జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎ.ఎం. ఖన్విల్కర్‌ల నేతృత్వంలోని కొలీజియం ఈమేరకు నిర్ణయం తీసుకొంది. సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ చొరవ చూపి గత జూన్‌లో కోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడున్న ఖాళీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నియామకాలకు సిఫార్సు చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తుండటం, ఇటీవలే జస్టిస్ చల్లాకోదండరాం రిటైర్‌కావడం, జస్టిస్ కేశవరావు కన్నుమూయడంతో అక్కడ పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 11కి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కొలీజియం ఒకేసారి ఏడుగురు న్యాయాధికారులకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించి ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి పేర్లు సిఫార్సు చేసింది. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఏడుగురి నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 18కి పెరుగుతుంది. అప్పటికీ ఇంకా 24 పోస్టులు ఖాళీగానే ఉంటాయి. ఈ హైకోర్టుకు కేటాయించిన 42 పోస్టుల్లో 28 మందిని న్యాయవాదుల నుంచి, మిగిలిన 14 మందిని రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి ఎంపిక చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 2,48,267 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2,11,927 సివిల్‌వి కాగా, 36,340 క్రిమినల్‌వి.
నూతన న్యాయమూర్తుల ప్రస్థానమిది...
పి.శ్రీసుధ :
1962 జూన్ 6న నెల్లూరులో జన్మించారు. 1992లో న్యాయవాదిగా నమోదై 2002 ఆగస్టు 21న జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, కరీంనగర్, విశాఖపట్నం, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా, జ్యుడిషియల్ అకాడమి డైరెక్టర్‌గా, వ్యాట్ అప్పీలెట్ ట్రైబ్యునల్‌గా విధ]ులు నిర్వహించారు.
సి.సుమలత:
1972 ఫిబ్రవరి 5న నెల్లూరులో జన్మించారు. 1995లో పద్మావతి మహిళా యూనివర్సిటీ (తిరుపతి) నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. రైట్ టు టైమ్‌లీ జస్టిస్ అనే అంశంపై నాగార్జున యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. జిల్లా జడ్జిగా 2007లో ఎంపికై కర్నూలు, మదనపల్లె, అనంతపురం, గుంటూరుల్లో పనిచేశారు. జ్యుడిషియల్ అకాడమి డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా కొనసాగుతున్నారు.
డాక్టర్ గురిజాల రాధారాణి :
1963 జూన్ 29 గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. 1989లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా, ఏపీపీగా విధులు నిర్వహించారు. 2008లో జిల్లా జడ్జిగా నియమితులై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఎం.లక్ష్మణ్ :