తెలంగాణ

telangana

ETV Bharat / city

రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు - esi culprits in cbi custody

ఈఎస్​ఐ మెడికల్ స్కాంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.  ఏడుగురు నిందితులను రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు.

రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

By

Published : Oct 9, 2019, 11:03 AM IST

Updated : Oct 9, 2019, 1:18 PM IST

రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలు కుంభకోణంలో నలుగురు నిందితులను అనిశా అధికారులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఈఎస్​ఐ మాజీ సంచాలకురాలు దేవికా రాణి సహా స్కాంలో కీలకంగా వ్యవహరించిన పద్మజ, రాధిక, వసంత ఇందిరల, శ్రీహరి, నాగరాజు, హర్షవర్ధన్​ను విచారించనున్నారు.

ఇప్పటివరకు 13 మంది అరెస్ట్

ఈ కేసులో అనిశా... ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో ఆరుగురిని 2 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారమే అనుమతి వచ్చినా.. దసరా సెలవులతో.. ఇవాళ కస్టడీకి తీసుకున్నారు.

విచారణ కోసం ప్రశ్నావళి సిద్ధం

కుంభకోణంలో ఇంకా ఎవరున్నారు.. ఎవరి వాటా ఎంత.. అనే అంశాలకు విచారణలో స్పష్టత వచ్చే అవకాశముంది. అనంతరం మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంది.

Last Updated : Oct 9, 2019, 1:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details