రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి తపాలా ద్వారా ఆలయాల ఆర్జిత సేవలసు అందించనున్నారు. ఈ మేరకు తపాలాశాఖతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ తపాలా కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సేవలు ప్రారంభించనున్నారు.
నేటి నుంచే తపాలా ద్వారా ఆలయాల ఆర్జిత సేవలు
తెలంగాణలో శుక్రవారం నుంచి తపాలా ద్వారా ఆలయాల ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ తపాలా కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సేవలు ప్రారంభించనున్నారు.
నేటి నుంచే తపాలా ద్వారా ఆలయాల ఆర్జిత సేవలు
ఆర్జిత సేవల జాబితాలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, యాదాద్రి, వేములవాడ, కొండగట్టు, బాసర, భద్రాచలం ఆలయాలు ఉన్నాయి. కొమురవెల్లి, వనస్థలిపురం గణేశ్ ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ, కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయాల్లోనూ తపాలా సేవలు అందనున్నాయి.
అర్చన, అభిషేకం సహా 180 రకాల సేవలు తపాలా ద్వారా భక్తులకు అందిస్తారు. సేవలకు భక్తులు తమ వివరాలతో తపాలా కార్యాలయంలో రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేవాదాయ శాఖ మొబైల్ యాప్ ద్వారా కూడా సేవలు అందిస్తోంది.
- ఇదీ చూడండి :వస్త్రాభరణాల ప్రదర్శనలో తళుక్కుమన్న మన్నారా