హలో ఓటర్.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు! - no selfie in voting
10:06 January 22
హలో ఓటర్.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!
పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు అనుమతించరు. ఓటు వేసిన అనంతరం ఎవరికి వేశామో తెలిసేలా స్వీయ(సెల్ఫీ) చిత్రాలు తీసుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. గత అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొంతమంది ఓటు వేసి సెల్ఫీ తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వారిపై అధికారులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.
అలా ఓటేస్తూ సెల్ఫీ దిగితే ఓటును రద్దు చేస్తారు. ఎలా అంటే ఆ ఓటును 17 ఏ లో ఎన్నికల అధికారి నమోదు చేస్తారు. అలా నమోదు చేసిన ఓటును ఓట్ల లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకోరు. జరిమానా కూడా విధిస్తారు.